7 నెలల చిన్నారి క్యాన్సర్ ఆపరేషన్ కు సీఎం జగన్ హామీ..

-

ఈ రోజు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్ట్ పనులను పరిశీలించడానికి వెళ్ళాడు. అక్కడ నివసిస్తున్న ప్రజల సమస్యలను అడిగి తెలుసుకునే క్రమంలో ఒక కొవ్వూరు మండలం ఔరంగాబాద్ గ్రామానికి చెందిన అపర్ణ అనే మహిళ తన 7 సంవత్సరాల పాపను కబళించి ఉన్న క్యాన్సర్ వ్యాధి గురించి చెప్పుకుని బాధపడింది. తెలుస్తున్న సమాచారం ప్రకారం నిస్సీ ఆరాధ్య అనే పాపకు పుట్టుకతో కిడ్నీ సంబంధిత క్యాన్సర్ ఉంది, ఈమెకు ఆపరేషన్ చేయించుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉండడంతో సీఎం జగన్ ను సహాయం కోరింది. ఆమె సమస్యను విన్న సీఎం జగన్ వెంటనే ఆ పాప కోసం కొంత ఆర్ధిక సహాయాన్ని అందించడమే కాకుండా, ఆమెకు అవసరం అయిన అన్ని వైద్య సేవలను చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు.

దీనితో మరోసారి సీఎం జగన్ పేద ప్రజల పాలిట పెన్నిధిగా మారాడని ప్రజలు మెచ్చుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news