నెల్లూరు వైసిపి నాయకులపై సీఎం జగన్‌ సీరియస్‌

-

నెల్లూరు వైసిపి రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. నెల్లూరు జిల్లాలో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి , మాజీ మంత్రి అనిల్ పోటాపోటిగా సభలు నిర్వహిస్తున్నారు. నెల్లూరు నగరంలో వాహనాలతో కాకాని ర్యాలీ చేయగా… భారీగా స్వాగత ఏర్పాట్లు చేశారు నేతలు, అభిమానులు. మరో వైపు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో నెల్లూరులో గాంధీ సర్కిల్ వద్ద బహిరంగ సభ నిర్వహించ బోతున్నారు.

ప్రతిష్టాత్మకంగా సభ నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారు ఇద్దరు వైసీపీ పార్టీ కీలక నేతలు.
ఒకే సమయంలో ఇరువురి నేతలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.

ఈ నేపథ్యంలోనే.. నెల్లూరు రాజకీయాలపై పార్టీ అధిష్టానం జోక్యం చేసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి.. నెల్లూరు వైసీపీ నాయకులపై సీరియస్‌ అయినట్లు సమాచారం అందుతోంది.
విమర్శలు..వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దని కూడా సీఎంజగన్ మోహన్‌ రెడ్డి ఆదేశాలు జారీ చేశారట.

Read more RELATED
Recommended to you

Exit mobile version