బద్వేలు ఉప ఎన్నికపై జగన్ కీలక నిర్ణయం.. ప్రచారానికి దూరం !

-

బద్వేలు ఉప ఎన్నికపై క్యాంప్ కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నారు సిఎం జగన్. బద్వేలు ఉప ఎన్నికకు పార్టీ ఇన్‌ఛార్జిగా పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి ని నియమిస్తున్నట్లు స్పష్టం చేశారు సిఎం జగన్. దివంగత వెంకటసుబ్బయ్యగారి భార్య సుధ గారు కూడా డాక్టరేనని.. తమ పార్టీ తరఫు నుంచి ఆమెను అభ్యర్థిగా నిలబెడుతున్నామని తెలిపారు సీఎం వైయస్‌.జగన్‌.

బద్వేలు నియోజకవర్గ బాధ్యతలన్నీ ఇక్కడకు వచ్చిన వారి అందరిమీదా ఉన్నాయని.. నామినేషన్‌ కార్యక్రమానికి అందరూ హాజరు కావాలన్నారు. 2019లో దాదాపు 44వేలకుపైగా ఓట్ల మెజార్టీ వచ్చిందని..
గతంలో వెంకసుబ్బయ్యగారికి వచ్చిన మెజార్టీ కన్నా.. ఎక్కువ మెజార్టీ డాక్టర్‌ సుధగారికి రావాలని పేర్కొన్నారు. ఎక్కడా అతి విశ్వాసం ఉండకూడదని.. కష్టపడి ప్రజల ఆమోదాన్ని పొందాలన్నారు.

2019లో 77శాతం ఓటింగ్‌ జరిగిందని.. ఓటింగ్‌ శాతం పెరగాలి, ఓట్లు వేసేలా ఓటర్లను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. ప్రతి సామాజిక వర్గాన్ని కలుపుకుపోవాలని.. ప్రతి మండలం కూడా బాధ్యులకు అప్పగించాలన్నారు సిఎం జగన్. గ్రామస్థాయి నాయకులతో కలిపి ప్రచారం నిర్వహించాలని.. ఒక్కో ఇంటికి కనీసం మూడు నాలుగు సార్లు వెళ్లి.. వారిని అభ్యర్థించాలని వెల్లడించారు. బద్వేలు ఉప ఎన్నిక పార్టీ ఇన్‌ఛార్జిగా పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డిను నియామకం చేయడం తో.. సిఎం జగన్.. ఈ ప్రచారానికి కూడా దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది..

Read more RELATED
Recommended to you

Exit mobile version