బద్వేలు ఉప ఎన్నిక బరిలో జనసేన పార్టీ !

-

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని బద్వేలు ఉప ఎన్నికకు రెండు రోజుల క్రితం కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. హుజురాబాద్‌ నియోజక వర్గ ఉప ఎన్నిక తో పాటు బద్వేలు ఉప ఎన్నికకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం.అక్టోబర్‌ 30 న బద్వేలు ఉప ఎన్నిక పోలింగ్ జరుగనుండగా… అక్టోబర్‌ 1న నోటిఫికేషన్ విడుదల కానుంది.

ఇక నవంబర్ 2వ తేదీ ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన కూడా చేయనున్నారు ఎన్నికల అధికారులు. అయితే ఈ ఉప ఎన్నిక ల్లో వెంకట సుబ్బయ్య సతీమణి డాక్టర్ సుధ కు సీఎం జగన్ టికెట్ ఖరారు చేయగా…టీడీపీ అభ్యర్థిగా డా. ఓబుళా పురం రాజశేఖర్‌ ను ఇప్పటికే ప్రకటించారు చంద్రబాబు. అటు బీజేపీ, జనసేన, కాంగ్రెస్‌ పార్టీలు ఇంకా తమ అభ్యర్థులను ప్రకటించలేదు.

ఈ నేపథ్యం లోనే బద్వేలు ఉప ఎన్నికల్లో పోటీపై బీజేపీ-జనసేన మధ్య సంప్రదింపులు కొనసాగుతోంది. ఏ పార్టీ పోటీ చేయాలనే అంశంపై తర్జన భర్జన అవుతున్నాయి.జనసేన నుంచి అభ్యర్థిని పెట్టాలని బీజేపీ సూచించినట్లు సమాచారం అందుతోంది. తిరుపతిలో బీజేపీ పోటీ చేసిన కారణంగా బద్వేల్లో జనసేనకు అవకాశం ఇవ్వాలన్న యోచనలో బీజేపీ పార్టీ ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఇదే విషయాన్ని జనసేన ముఖ్యులకు తెలిపారు బీజేపీ రాష్ట్ర పార్టీ నేతలు. ఇక దీనిపై కాసేపట్లోనే క్లారిటీ రానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version