స్కూల్స్ లోనూ కరోనా పరీక్షలు : సీఎం జగన్

-

అమరావతి : కోవిడ్‌ పరిస్థితులపై క్యాంపు కార్యాలయంలో ఇవాళ సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు.. ఈ సందర్భంగా సిఎం జగన్ మాట్లాడుతూ… స్కూళ్లు తెరిచినందున అక్కడ కోవిడ్‌ ప్రోటోకాల్స్‌ సమర్థవంతంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని.. వైద్య ఆరోగ్య శాఖ మార్గదర్శకాలను పాటించేలా అధికారులు దృష్టిపెట్టాలని పేర్కొన్నారు. మాస్క్‌లు ధరించేలా, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం.. స్కూళ్లలో కరోనా టెస్టింగ్‌కు కూడా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

ఒకవేళ ఎవరికైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేసేలా చూడాలన్న సీఎం జగన్.. థర్డ్‌వేవ్‌ నేపథ్యంలో ముందస్తుగా తీసుకోవాల్సిన చర్యలపైనా సమీక్ష నిర్వహించారు. ప్రాధాన్యతా క్రమంలో వ్యాక్సిన్‌ ఇచ్చుకుంటూ వెళ్లాలన్న సీఎం.. ఉదయం 6 గంటలనుంచి రాత్రి 11 గంటల వరకూ కర్ఫ్యూ సడలింపులు ఇస్తున్నట్లు ప్రకటించారు. తెల్లవారు జామున పెళ్లిళ్లు ఉంటే… ముందస్తుగా అనుమతి తీసుకోవాలన్నారు. పెళ్లిళ్లలో 150 మందికే అనుమతి ఉందని పేర్కొన్నారు. కోవిడ్‌ ప్రోటోకాల్స్‌ పాటించేలా అధికారులు స్వయంగా పర్యవేక్షించాలన్న సీఎం.. ఉల్లంఘించేవారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news