ఏపీ సీఎం జగన్ సరికొత్త ఆలోచన శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. 2024 ఎన్నికలే లక్ష్యంగా సీఎం జగన్ వ్యూహాలు రచిస్తున్నారు. ఈ నేపత్యంలో కార్యకర్తలతో భేటీ అవుతున్నారు. అయితే ఈరోజు తొలిసారిగా కుప్పం నియోజకర్గ కార్యకర్తలతో సీఎం జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుప్పం నా సొంత నియోజకవర్గంతో సమానమని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా.. భరత్‌ను గెలిపిస్తే.. మంత్రి పదవి ఇస్తానన్నారు.
చంద్రబాబు హయాంలో కన్నా.. ఈ మూడేళ్లలో కుప్పంకు అత్యధికంగా మేలు జరిగిందని ఆయన వెల్లడించారు. కుప్పం మున్సిపాల్టీకి సంబంధించి రూ.65 కోట్ల విలువైన పనులను మంజూరు చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. కుప్పం అభివృద్ధికి అన్ని వేళలా అండగా ఉంటామని జగన్ హామీ ఇచ్చారు. 175 కి 175 సీట్లు గెలిచే పరిస్థితి కుప్పం నుంచే మొదలు కావాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు.