అమిత్ షాతో జగన్ భేటీ

-

ఏపీ సీఎం జగన్‌ ఢిల్లీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. అయితే.. ఈ పర్యటనలో భాగంగా సీఎం జగన్‌ పలువురు కేంద్రమంత్రులతో భేటీ అవుతున్నారు. ఈ క్రమంలోనే.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం జగన్ మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. ఏపీకి సంబంధించిన కీలక అంశాలపై చర్చిస్తున్నారు. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన పెండింగ్ అంశాలపైనా ఈ భేటీలో చర్చిస్తున్నారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసు, చంద్రబాబు అరెస్ట్ అంశాలపైనా చర్చినట్లు తెలుస్తోంది. అనంతరం సీఎం జగన్ మోహన్ రెడ్డి ఏపీకి బయల్దేరనున్నారు.

ఇదిలా ఉంటే.. నిన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌, కేంద్ర విద్యుత్‌ శాఖమంత్రి ఆర్కే సింగ్‌‌లతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన అలు అంశాలపై చర్చించారు. పోలవరం ప్రాజెక్టు, రాష్ట్రానికి రావాల్సిన విద్యుత్‌ బకాయిల అంశాలపై ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌తో చర్చించారు. పోలవరం ప్రాజెక్టుకు నిధుల విడుదలపై చర్చ జరిగింది.సత్వరం ప్రాజెక్టును పూర్తిచేయాల్సి అవసరం ఉందని.. వీలైనంత త్వరగా ప్రాజెక్టు ఫలితాలను అందించేందుకు సహకరించాలన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version