కష్టం మాది.. ఫలితం మీదని జబ్బలు చరుచుకుంటారా? : ఎమ్మెల్సీ కవిత

-

కాంగ్రెస్ సర్కారుపై ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా ఫైర్ అయ్యారు. బుధవారం ఉదయం యాదగిరిగుట్టకు చేరుకున్న ఆమె శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని స్థానిక మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్ పాలనలోనే యాదాద్రి పుణ్యక్షేత్రం అభివృద్ధి జరిగిందన్నారు. శ్రీ లక్ష్మీనరసింహ స్వామి జన్మనక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా నిర్వహించే గిరి ప్రదక్షిణలో కవిత, స్థానిక మాజీ ఎమ్మెల్యే పాల్గొన్నారు.

కేసీఆర్ చేపట్టిన అభివ‌ృద్ధి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించి యాదాద్రి క్షేత్ర వైభవాన్ని మరింత పెంచాలని కోరారు.ఉమ్మడి నల్లగొండలో ఫ్లోరైడ్‌ను కేసీఆర్ మిషన్ భగీరథతో పారద్రోరినట్లు పేర్కొన్నారు.పార్లమెంటులో కేంద్రం సైతం ఈ విషయాన్ని దృవీకరించిందని గుర్తుచేశారు. కేసీఆర్ మదిలోని ఆలోచనతో మూసీ ప్రక్షాళన, పునరుజ్జీవానికి మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి పేరుతో మూడు ట్రీట్ మెంట్ ప్లాంట్లు పెట్టామని, వాటిని ప్రారంభించి తామే ఇదంతా చేసినట్లు కాంగ్రెస్ నేతలు జబ్బలు చరుచుకుంటున్నారని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version