అమరావతి : రేపు ఒరిస్సా పర్యటనకు వెళ్లనున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం జగన్. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారులు. రేపు సాయంత్రం 5 గంటలకు ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్నారు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.
ఒరిస్సా రాజధాని భువనేశ్వర్ లోని నవీన్ పట్నాయక్ నివాసంలో రెండు గంటల పాటు జరుగనున్న సమావేశం కానున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల మధ్య నదీజలాల విషయంలో చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. అలాగే బార్డర్ విషయాలను కూడా చర్చించనున్నారు సీఎం జగన్. ఈ సమావేశం అనంతరం ఏడు గంటల 15 నిమిషాలకు తాడేపల్లికి తిరుగు ప్రయాణం కానున్నారు సీఎం జగన్.
ఇక రేపు రాత్రి 9 గంటల ప్రాంతంలో తాడేపల్లికి చేరుకోనున్నారు సీఎం జగన్. ఈ నేపథ్యంలోనే ఇవాళ సీఎం జగన్ ఒరిస్సా పర్యటన సన్నాహక సమావేశం జరిగింది. ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో రేపటి భేటీలో ప్రస్తావించాల్సిన అంశాల పై సమావేశంలో చర్చ జరిగింది. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న సరిహద్దు, నీటి వివాదాల పరిష్కారం దిశగా కసరత్తు జరుగుతొంది.