ఇష్టమైన అధికారికి కీలక బాధ్యతలు ఇచ్చిన జగన్…!

-

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల ముందు కీలక పరిణామం చోటు చేసుకుంది. పలువురు కీలక ఐపిఎస్ అధికారులను బదిలీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. కొందరికి ప్రమోషన్ కూడా ఇచ్చింది. ఇవి అన్నీ తక్షణమే అమలులోకి రానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.

అదనపు డీజీగా సీనియర్ అధికారి ఆర్‌ కే మీనా (వైఎస్ కుటుంబానికి సన్నిహితులుగా పేరుంది), ఎస్‌ఐబీ చీఫ్‌గా శ్రీకాంత్‌, మెరైన్ పోలీస్ చీఫ్‌గా ఎ.ఎస్‌.ఖాన్‌, ప్రొవిజినల్‌ లాజిస్టిక్‌ ఐజీగా నాగేంద్రకుమార్‌, ఇంటెలిజెన్స్‌ ఐజీగా రఘురామిరెడ్డి, ఏసీబీ ఐజీగా అశోక్‌కుమార్‌, గుంటూరు రేంజ్‌ ఐజీగా జె. ప్రభాకర్‌రావు, ఇంటెలిజెన్స్‌ డీఐజీగా విజయ్‌కుమార్‌, ఏలూరు రేంజ్‌ డీఐజీగా కేవీ మోహన్‌ రావులకు ప్రమోషన్ కల్పించారు.

పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ ఛైర్మన్‌గా హరీష్‌కుమార్‌ గుప్తా, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌గా వినీత్ బ్రిజ్‌లాల్‌, నర్సీపట్నం ఓఎస్డీగా సుమిత్‌ సునీల్‌, ఎపీఎస్పీ కాకినాడ కమాండెంట్‌గా అమిత్‌ బర్దార్‌, కర్నూలు అదనపు ఎస్పీగా గౌతమిశాలి, ఎపీఎస్పీ మంగళగిరి కమాండెంట్‌గా బి. క్రిష్ణారావు బదిలీ అయ్యారు. వీరిలో వినీత్ బ్రిజ్‌లాల్‌కు ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది రాష్ట్ర ప్రభుత్వం. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు జరిగిన ఈ మార్పులు ఇప్పుడు కీలకంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version