అమరావతి : కోవిడ్‌తో సహజీవనం చేయాల్సిన పరిస్థితి కచ్చితంగా ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ఇవాళ కరోనా పరిస్తుతలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గణాంకాలు, అంకెలతో సంబంధం లేకుండా కోవిడ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏపీలో సగటున రోజు వారీ 1300 కేసులు నమోదవుతున్నాయని.. రివకరీ రేటు 98.63 శాతంగా ఉందన్నారు. వీక్లీ పాజిటివిటీ రేటు 2.07 శాతం ఉన్నా అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.
మార్గదర్శాలను పాటించకపోతే కఠినంగా వ్యవహరించాలని.. పెళ్లిళ్లలో 150కి మించి ఉండకుండా చూడాలని ఆదేశించారు. విద్యాసంస్థల్లో పాటించాల్సిన ఎస్‌ఓపీలను కచ్చితంగా పాటించాలని.. లక్షణాలు ఉంటే విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు వెంటనే పరీక్షలు చేయాలని పేర్కొన్నారు. 104 అనే నంబరు ఒన్‌స్టాప్ సొల్యూషన్ కావాలని.. థర్డ్ వేవ్ వస్తుందో, లేదో తెలియగానే మన సన్నద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఆస్పత్రులను, సిబ్బందిని సన్నద్ధంగా ఉంచుకోవాలని.. అందుబాటులో బెడ్లను, ఆస్పత్రులను ఉంచుకోవాలని తెలిపారు సిఎం జగన్.