ఒమిక్రాన్ వేరియంట్ పై జగన్ సమీక్ష.. డోర్ టు డోర్ సర్వే చేయాలని ఆదేశాలు !

-

ఒమి క్రాన్ వేరియంట్ పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇవాళ ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. కరోనా రూపాంతరం చెందుతున్న నేపథ్యంలో… ఖచ్చితంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్మోహన్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న వ్యాక్సిన్ ను వీలైనంత త్వరగా వినియోగించాలని పేర్కొన్నారు.

అలాగే ఏపీ వ్యాప్తంగా ఉన్న ప్రజలు కచ్చితంగా మాస్కులు ధరించి ఎలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా జనాలు గుమిగూడా కుండా చూడాలని ఆదేశించారు సీఎం జగన్. అలాగే డోర్ టు డోర్ వాక్సినేషన్ ప్రక్రియను సాగించాలని దానితోపాటు ఫీవర్ సర్వే కూడా చేయాలని పేర్కొన్నారు. ఎలాంటి అనారోగ్య సమస్య ఉన్నా…104 కు కాల్ చేస్తే వైద్యం అందుబాటులో ఉండాలన్నారు. డిసెంబర్ మాసం పూర్తి అయ్యే వరకు రెండు కోట్ల డోసుల వ్యాక్సినేషన్ ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్. ప్రభుత్వాసుపత్రిలో ఆక్సిజన్ కొరత లేకుండా చూసుకోవాలని పేర్కొన్నారు

Read more RELATED
Recommended to you

Exit mobile version