ఓమిక్రాన్ పై WHO తాజా హెచ్చరికలు.. తీవ్రమైతే ముప్పే…

-

ప్రపంచ దేశాలను ఓమిక్రాన్ వేరియంట్ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. దేశాలు తమ సరిహద్దులను మళ్లీ మూసేసే పరిస్థితికి వచ్చాయి. ఓమిక్రాన్ తీవ్రంగా ఉన్న దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధిస్తున్నాయి మిగతా ప్రపంచ దేశాలు. ఇప్పటికే ఇజ్రాయిల్, జపాన్ దేశాలు విదేశీ ప్రయాణికులకు బోర్డర్స్ క్లోజ్ చేశాయి. బ్రిటన్ ఇతర యూరోపియన్  దేశాలు విదేశాల నుంచి వచ్చే ప్రతీ ఒక్కరికి ఆర్టీపీసీఆర్ టెస్ట్ లను తప్పని సరి చేసింది. సౌతాఫ్రికాలో పుట్టిన ఓమిక్రాన్ అనతి కాలంలోనే 15 దేశాలకు వ్యాపించడం గుబులు రేపుతోంది.

తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO కూడా ఓమిక్రాన్ పై ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఓమిక్రాన్ తో ప్రపంచ దేశాలకు తీవ్ర ముప్పు ఉందని హెచ్చరించింది. ఈ వేరియంట్ తో కరోనా మరోసారి ప్రబలితే తీవ్ర పరిణామాలు తప్పకపోవచ్చని అంచనా వేస్తోంది. అయితే ఇప్పటి వరకు ఓమిక్రాన్ వేరియంట్ తో ఒక్క మరణం కూడా సంభవించ లేదని.. అది ఏస్థాయిలో వ్యాప్తి చెందుతుందో .. తీవ్రత ఎలా ఉంటుందో.. అనే విషయాలపై అనిశ్చితి నెలకొందని WHO హెచ్చరించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version