ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేసారు. విజయవాడ గేట్ వే హోటల్ లో ఒక కార్యక్రమంలో పాల్గొన్న జగన్ ఈ సందర్భంగా రాజధానిపై కీలక వ్యాఖ్యలు చేసారు. అమరావతి శాసన రాజధానిగా ఉంటుంది అంటూ జగన్ వ్యాఖ్యానించారు. బాహుబలి గ్రాఫిక్స్ తాను చూపించను అంటూ జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. అమరావతిలో అభివృద్ధి ఆగదు అన్నారు.
విశాఖలో మౌలిక వసతులు అన్నీ ఉన్నాయని వ్యాఖ్యానించిన జగన్… అమరావతిలో రాజధాని నిర్మాణానికి లక్ష కోట్లకుపైగా ఖర్చు అవుతుంది అన్నారు. విశాఖ అభివృద్ధి చెందిన నగరమని జగన్ వ్యాఖ్యానించారు. ఐదేళ్ళలో విశాఖ అభివృద్ధికి ప్రణాలికలు ఉన్నాయని అన్నారు. విశాఖ ఏపీలో ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరమని అన్నారు. ఒక ముఖ్యమంత్రిగా తాను నిర్ణయాలు తీసుకోకపోతే భవిష్యత్తు తరాలపై ప్రభావం పడుతుంది అన్నారు.
నిధుల కొరత వలనే రాజధాని వికేంద్రీకరణ నిర్ణయం అన్నారు. తాను ఎవరిని తప్పుదోవ పట్టించడం లేదని అన్నారు. తన తండ్రి ప్రారంభించిన ప్రాజెక్ట్ లు ఇంకా పూర్తి చేయలేదని, రాయలసీమలో డ్యాం లు ఇంకా పూర్తిగా కట్టలేదని, అక్కడ కట్టినవి నిండ లేదని అన్నారు. కాలవల సామర్ధ్యం పెంచకపోవడమే దీనికి కారణమని జగన్ అన్నారు. తాను నిధులు ఎక్కడి నుంచి తీసుకురావాలి అంటూ జగన్ వ్యాఖ్యలు చేసారు.
తన తండ్రి పూర్తి చేసిన ప్రాజెక్టులు పూర్తి చేయడానికి 25 వేల కోట్లు నిధులు కావాలని అన్నారు. ప్రతీ ఏటా మూడు వేల టీఎంసీల నీళ్ళు సముద్రంలోకి వేల్లిపోతున్నాయని అన్నారు. రాష్ట్ర జనాభాలో 62 శాతం వ్యవసాయం మీద ఆధారపడి బ్రతుకుతున్నారని అన్నారు. 1600 టీఎంసీకి మించి కృష్ణా నీరు రావడం లేదని అన్నారు. కృష్ణా ఆయకట్టు భవిష్యత్తు ప్రశ్నార్ధకం అయింది అన్నారు.
గోదావరి నీటిని కృష్ణాకు మళ్లించడమే తమ లక్ష్యమని అన్నారు. గోదావరి నీరు అనవసరంగా సముద్రంలోకి వృధాగా వెళ్ళిపోతుందని అన్నారు. 25 లక్షల ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని తాము భావిస్తున్నామని జగన్ అన్నారు. ఈ ఉగాదికి ఇస్తామని జగన్ స్పష్టం చేసారు. ప్రతీ ఏటా 6 లక్షల ఇళ్ళను నిర్మిస్తున్నామని అన్నారు. ఐదేళ్లలో విశాఖ నగరం… బెంగళూరు, హైదరాబాద్, ముంబైతో పోటీ పడవచ్చని అన్నారు.