ఒకే రోజు జగన్ రెండు సంచలన నిర్ణయాలు..!

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రజలకు సంక్షేమం తో పాటుగా పాలనలో మార్పులు తీసుకుని వస్తున్నారు. ప్రతీ నిర్ణయం కూడా ప్రజలను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు జగన్. ఎన్ని ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా సరే సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు.

తాజాగా సిఎం వైఎస్ జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగం పొందాలి అని అనుకుంటే కచ్చితంగా ఇంటర్ విద్యార్హత తప్పనిసరిగా కావాలని కీలక ఆదేశాలు ఇచ్చింది ఏపీ సర్కార్. దశాబ్దాల నుంచి ప్రభుత్వ ఉద్యోగాలకు పదవ తరగతి అర్హతగా ఉంది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం మారుస్తూ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన విధి విధానాలను త్వరలో విడుదల చేస్తారు.

అంతే కాకుండా విద్యా సంవత్సరాన్ని కూడా మారుస్తూ ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. సాధారణంగా జూన్ 12 నుంచి ఏప్రిల్ 23 వరకు విద్యా సంవత్సరం ఉంటుంది. కాని కరోనా కారణంగా ఇప్పుడు పరిస్థితి మారింది కాబట్టి ఈ ఏడాది ఆగష్టు నుంచి వచ్చే ఏడాది 2021 జూలై వరకు విద్యా సంవత్సరం కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్‌ ఎత్తేసిన రెండు వారాల తర్వాత పదో తరగతి పరీక్షలు జరపాలని ప్రభుత్వం భావిస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version