మూడు దశల్లో స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణం : సీఎం జగన్

-

స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో మొత్తం జిల్లా, ప్రాంతమంతా అభివృద్ధి అవుతుందన్నారు సీఎం జగన్‌. గతంలో వైఎస్ ఎన్నో కలలు కన్నారు.. అనాడు స్టీల్ ప్లాంట్ కోసం పరితపించారు.. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పట్టించు కాలేదు.. దేవుడి దయవల్ల నేడు జిందాల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటవుతోందని సీఎం జగన్‌ వ్యాఖ్యానించారు. మూడు దశల్లో స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణం చేపట్టనున్నట్లు, 36 నెలల్లో 3300 కోట్లతో మొదటి దశ.. మరో ఐదేళ్లలో మొత్తం పరిశ్రమ నిర్మాణం పూర్తి అవుతుందన్నారు. మూడు మిలియన్ టన్నులతో కాదు ఇంకా పెరుగుతుందని, ప్లాంట్ సపోర్ట్ కోసం చాలా కష్ట పడ్డామన్నారు. మంచి రోజులు వచ్చాయని సీఎం జగన్‌ వ్యాఖ్యానించారు. దేవుడి దయతో వైఎస్సార్‌ జిల్లాలో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఎన్నికల కోడ్‌ ఉన్నందున ఎక్కువ మందిని పిలవలేకపోయామన్నారు. ఎప్పట్నుంచో కలలుగన్న స్వప్నం ఈ స్టీల్‌ప్లాంట్‌. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని వైఎస్సార్‌ కలలుగన్నారు. వైఎస్సార్‌ మరణంతో ఈ ప్రాంతాన్ని ఎవరూ పట్టించుకోలేదని సీఎం అన్నారు.

‘‘రూ.8,800 కోట్లతో 3 మిలియన్‌ టన్నుల స్టీల్‌ ఉత్పత్తి అవుతుంది. స్టీల్‌ ప్లాంట్ ఏర్పాటుతో జిల్లా మరింత అభివృద్ధి చెందుతుంది. ఈ ప్లాంట్‌ రావడం కోసం కష్టాపడాల్సి వచ్చింది. అయినప్పటికీ దేవుడి దయతో మనకు మంచి రోజులు వచ్చాయి. స్టీల్‌ ప్లాంట్‌వస్తే ఈ ప్రాంతం స్టీల్‌ సిటీ తరహాలో అభివృద్ధి చెందుతుంది. గండికోట రిజర్వాయర్‌ నుంచి ప్రత్యేక పైపులైన్‌ ద్వారా నీటి సరఫరా అవుతుంది. తొలి విడతలో రూ. 3,300 కోట్లతో ఏటా 10 లక్షల టన్నుల ఉక్కు ఉత్పత్తి అవుతుంది’’ అని సీఎం జగన్‌ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version