వరద బాధితులకు సీఎం జగన్ తీపి కబురు.. 25 కేజీల బియ్యం, రూ.2 వేలు

-

గోదావరి వరదలు, సహాయ కార్యక్రమాలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఉదయం అధికారులతో మాట్లాడిన సీఎం జగన్… గోదావరి వరద ప్రవాహం, తాజా పరిస్థితిపై ఆరా తీశారు. సురక్షిత ప్రాంతాలకు తరలింపుపై సీఎంకు వివరాలందించారు అధికారులు. ఎక్కడా కూడా ప్రాణనష్టం ఉండకూడదని స్పష్టంచేసిన సీఎం జగన్.. అవసరమైనంత మేర సహాయక బృందాలను వినియోగించుకోవాలని పేర్కొన్నారు. మరో 24 గంటలపాటు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు.

సహాయ శిబిరాల ఏర్పాటు, సౌకర్యాల కల్పనలో తగిన చర్యలు తీసుకోవాలని, సేవలు నాణ్యంగా ఉండాలని స్పష్టంచేసిన సీఎం… వరద‡ బాధిత కుటుంబాలకు రేషన్‌ పంపిణీ చేయాలని, యుద్ధ ప్రాతిపదికిన అన్నికుటుంబాలకు చేర్చాలని అదేశింయించారు. ప్రతి కుటుంబానికీ 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ బంగాళాదుంపలు, కిలో పామాయిల్, కేజీ ఉల్లిపాయలు అందించాలన్న సీఎం… అలాగే ప్రతి కుటుంబానికి రూ.2వేలు లేదా వ్యక్తికి రూ. వేయి చొప్పున శిబిరాలు విడిచి వెళ్లేలోగానే పంపిణీచేయాలన్నారు. ఈ పనులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్న సీఎం… ప్రతి గంటకూ వరద పరిస్థితిపై తనకు నివేదించాలని ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version