రేపు సీఎం వైఎస్‌ జగన్‌ విజయవాడ పర్యటన

-

రేపు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ విజయవాడలో పర్యటించనున్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఏపీఎన్‌జీవోస్‌ అసోసియేషన్‌ (ఏపీ నాన్‌ గెజిటెడ్‌ అధికారుల సంఘం) 21 వ రాష్ట్ర మహా సభలలో సీఎం జగన్‌ పాల్గొననున్నారు. మధ్యాహ్నం 12.05 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి ముఖ్యమంత్రి బయలుదేరనున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాంటి హామీలు, వరాలు ఇస్తారనేది ఉత్కంఠతగా మారింది.

తమ మహాసభలకు హాజరు కావాలంటూ ఏపీఎన్జీవోల అధ్యక్షుడు బండి శ్రీనివాస రావు, ప్రధాన కార్యదర్శి కేవీ శివారెడ్డి, ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) ఎన్ చంద్రశేఖర్‌ రెడ్డి ఇదివరకే.. వైఎస్ జగన్‌ను కలిసిన విషయం తెలిసిందే. ఆయనకు ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. AD ఈ సభల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల.. ఎదుర్కొంటోన్న సమస్యలు, వాటిని పరిష్కరించడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఏర్పాటు చేసిన 12వ పీఆర్సీ కమిషన్‌ అంశం కూడా ప్రస్తావనకు రానుంది. ఈ పీఆర్సీ కమిషన్‌‌కు రిటైర్డ్ ఐఏఎస్‌ అధికారి డాక్టర్ మన్మోహన్‌ సింగ్‌ను ఛైర్మన్‌గా నియమించింది ప్రభుత్వం.

Read more RELATED
Recommended to you

Exit mobile version