BREAKING : సీఎం జగన్ అనంతపురం పర్యటన వాయిదా పడింది. సీఎం జగన్ సోమవారం అనంతపురం జిల్లాలో పర్యటించాల్సి ఉండగా, అనివార్య కారణాలవల్ల రద్దయినట్లు కలెక్టర్ గౌతమి ప్రకటించారు.
రేపు జరగాల్సిన జగనన్న వసతి దీవెన కార్యక్రమం ఈనెల 26కు వాయిదా పడినట్లు తెలిపారు. ఆ రోజున విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారని చెప్పారు. ఇది ఇలా ఉండగా..కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డిని అరెస్ట్ చేసింది సీబీఐ. భాస్కర్ రెడ్డి సహా అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డిని కూడా సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో భాగంగానే.. కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డిని అరెస్ట్ చేసింది సీబీఐ.