IPL 2023 : పంజాబ్ కింగ్స్ బ్యాటర్ అరుదైన రికార్డ్

-

ఈ IPL లో ఆటగాళ్ళ పరుగులు, వికెట్లతో రికార్డులు నెలకొల్పితే పంజాబ్ కింగ్స్ బ్యాటర్ హర్ ప్రీత్ సింగ్ భాటియా ఖాతాల్లో విచిత్ర రికార్డు నమోదయింది. 2012 మే 19న పూణే వారియర్స్ కు ఆడిన లక్నోతో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కు ఆడాడు. ఈ రెండు మ్యాచ్ ల మధ్య 10ఏళ్ల 332 రోజుల గ్యాప్ వచ్చింది. కాగా, అంతకుముందు ఈ రికార్డ్ ఆస్ట్రేలియా ఆటగాడు మాత్యు వేడ్ పేరున ఉండేది.

ఇది ఇలా ఉండగా..విరాట్ కోహ్లీ, సౌరవ్ గంగూలీ మధ్య విభేదాలు ఉన్నాయన్నది బహిరంగ విషయం. కోహ్లీ కెప్టెన్సీ తొలగింపులో పరోక్షంగా గంగూలి పాత్ర ఉందన్నది అందరికీ తెలిసిందే. అయితే, తాజాగా ఐపీఎల్ 16వ సీజన్ లో ఈ ఇద్దరు మరోసారి ఎదురుపడ్డారు. గంగూలీ ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ కు డైరెక్టర్ గా ఉన్నాడు. శనివారం ఢిల్లీ క్యాపిటల్స్, ఆర్సిబి మధ్య మ్యాచ్ జరిగింది. మ్యాచ్ లో ఢిల్లీ ఇన్నింగ్స్ సందర్భంగా కోహ్లీ గంగులీని కోపంగా చూస్తూ ఇచ్చిన లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news