మీకు ఉదయాన్నే నిద్రలేవాలంటే బద్దకంగా ఫీల్ అవుతున్నారా?ఇది ఒకసారి ట్రై చెయ్యండి..

-

సినిమాలు,స్మార్ట్ ఫోన్ ల ప్రభావం జనాల మీద ఎంత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..వాటివల్ల నిద్ర పోవడం కాస్త ఆలస్యం అవుతుంది..ఇంకేముంది ఉదయం నిద్ర లేవాలంటే చాలా మంది బద్దకంగా ఫీల్ అవుతారు..ఈరోజుల్లో ప్రతి ఒక్కరికి ఈ సమస్య వస్తుంది.బద్ధకం మనుషులకు పెద్ద శత్రువుగా మారింది..ఆఖరికి రోజు వారి పనులు సమయానికి చేయడానికి కూడా బద్ధకిస్తుంటారు.

విద్యార్థులు, యువకుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చాలా మందికి ఉదయాన్నే లేవాలంటే బద్ధకం.. చదవాలంటే బద్ధకం.. ఇక రేపు పరీక్షలనగా ఒకటే కంగారుపడిపోతుంటారు. వాయిదా వేయడం అలవాటుగా చేసుకుంటూ.. తీరా సమయం దగ్గరపడగానే హడావుడి పడిపోతుంటారు..ఈ విషయం గురించి చెప్పడానికి కారణం అలారం బెడ్..అదేంటి వింతగా ఉంది అనుకోకండి..ఒకసారి ఆ బెడ్ గురించి వివరంగా తెలుసుకుందాం…

ఉదయాన్నే లేవాలంటే బద్ధకించే వారికి.. ఈ బెడ్ సరిగ్గా సరిపోతుంది. ఎంత మొద్దు నిద్రలో ఉన్నా.. నిద్ర మత్తు వదిలే వరకూ ఎత్తిపడేస్తుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు..ట్విట్టర్‌లో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఉదయం అవుతున్నా ఓ బాలుడు పడుకునే ఉంటాడు. అతన్ని నిద్రలేపేందుకు తల్లిదండ్రులు ఎలాంటి ఇబ్బంది పడకుండా.. చక్కని ఐడియా వేశారు. మామూలు అలారం అయితే లేవడనుకున్నారో ఏమోగానీ.. ఏకంగా అలారం బెడ్‌ను ఏర్పాటు చేశారు.

అందులో ఫిక్స్ చేసిన సమయం రాగానే ఒక్కసారిగా బెడ్.. పైకి, కిందకు కుదిపేస్తుంది. దెబ్బకు ఆ బాలుడు ఉలిక్కిపడి లేస్తాడు. ఎంత పడుకోవాలని ట్రై చేసినా సాధ్యం కాదు. చివరకు చేసేదిలేక.. బెడ్ కిందకు దిగి, అలారం ఆఫ్ చేస్తాడు. ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది..మొత్తానికి ఈ వీడియో అందరినీ ఆకర్షించింది.. ఇలాంటి బెడ్ అందరికి మత్తు వదిలిస్తుంది అంటూ కామెంట్లను అందుకుంటుంది..ఆ బెడ్ వీడియోను మీరు ఓ సారి చూడండి..

Read more RELATED
Recommended to you

Exit mobile version