వైయస్సార్ జలకళ పై సమీక్ష చేసిన సీఎం జగన్.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రైతులకు శుభ వార్త చెప్పారు. ప్రతి నియోజకవర్గానికి ఒక రిగ్గును అప్పగించాలని ఆదేశించారు. ఆ రిగ్గు ద్వారా రైతులకుబోర్లు వేయించాలని.. దీనివల్ల బోర్లు వేసే పని క్రమంగా ముందుకు సాగుతుందని సిఎం జగన్ పేర్కొన్నారు. బోరు వేసిన వెంటనే మోటారును బిగించాలన్నారు.
పాదయాత్రలో గ్రామాల్లో పరిస్థితులు చూపినప్పుడు ఆవేదన కలిగిందని వెల్లడించారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. అలాంటి పరిస్థితులను మార్చాలని.. నివాస ప్రాంతాల్లో మురుగు నీరు నిల్వ ఉండే పరిస్థితులు ఉండకూడదని చెప్పారు. రైతులకు మంచి జరిగేలా.. అన్నీ చర్యలు ఉండాలని స్పస్టం చేశారు ఏపీ సిఎం జగన్ మోహన్ రెడ్డి. ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందాలని కోరారు. ఎఫ్‌ఎస్‌టీపీ ప్లాంట్ల ఏర్పాటు పై సీఎం జగన్ కు ప్రణాళిక వివరించారు అధికారులు. వీటి నిర్వహణ పైనా ప్రత్యేక దృష్టి పెట్టాలని సిఎం జగన్ పేర్కొన్నారు.