అమరావతి : అక్రమ మద్యం, రవాణా పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటన చేశారు. మద్య నియంత్రణలో భాగంగా రేట్లను పెంచామని.. మూడింట ఒక వంతు దుకాణాలను మూసివేశామని పేర్కొన్నారు. బెల్టు షాపులు, పర్మిట్ రూమ్‌లను మూసి వేయించామని వెల్లడించారు. లిక్కర్ సేల్స్ నెలకు 34 లక్షల కేసుల నుంచి 21 లక్షల కేసులకు తగ్గాయన్నారు.
అక్రమ మద్యం తయారీ, రవాణా పై ఉక్కు పాదం మోపాలని పేర్కొన్నారు. నిర్దేశించిన రేట్ల కన్నా ఇసుక ను ఎక్కువ ధరకు అమ్మితే చర్యలు తీసుకోవాలని వెల్లడించారు సీఎం జగన్. ఎస్‌ఈబీ కాల్‌సెంటర్ నంబర్‌పై బాగా ప్రచారం చేయాలని వెల్లడించారు. అలాగే గంజాయ సాగు, రవాణాను అరికట్టాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. క్రమం తప్పకుండా దాడులు నిర్వహించాలన్న సీఎం.. పోలీసు విభాగాలు సమన్వయంతో పనిచేయాలని వెల్లడించారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా విశ్వవిద్యాలయాలు, కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. విశ్వవిద్యాలయాలు, కాలేజీలపైన పర్యవేక్షణ ఉండాలన్నారు సిఎం జగన్.