కొత్త బడ్జెట్ లో మిగిలిన రైతు రుణమాఫీ పూర్తి చేస్తాం : హరీష్ రావు

-

కరీంనగర్ జిల్లా : కొత్త బడ్జెట్ లో మిగిలిన రైతు రుణమాఫీ పూర్తి చేస్తామని మంత్రి హరీష్ రావు ప్రకటించారు. హుజూరాబాద్ లోని ఇల్లందకుంట మండల కేంద్రంలో శ్రీసీతారామచంద్రస్వామి కళ్యాణ మండపం లో స్వశక్తి మహిళా సంఘాలకు వడ్డిలేని ఋణాల, బ్యాంక్ లింకేజి మరియు స్త్రీనిధి ఋణాలు చెక్కుల పంపిణి కార్యక్రమానికి హాజరయ్యారు ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరిష్ రావు.

harishrao

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బతుకమ్మకు తరలివచ్చినట్టు మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారని.. ఒక్క ఇల్లందకుంట మండలానికే వడ్డీ లేని రుణాలు రూ. 3.14 కోట్లు వచ్చాయన్నారు. ఒక్క రూపాయి బాకీ లేకుండా వడ్డీ లేని రుణాలు మహిళ సంఘాలకు ఇస్తున్నామని.. ఇల్లందకుంటలో ఒక్క ఊరిలో కూడా మహిళా సంఘాలకు భవనం లేదని పేర్కొన్నారు.

18 గ్రామాల్లో 18 మహిళా భవనాలకు రూ. 2.36 కోట్లు మంజూరు చేశామన్నారు. ఇల్లందకుంటలో మండల సమాఖ్య భవనానికి కూడా రూ. 50 లక్షలు మంజూరు.. బిల్డింగ్ లో కావాల్సిన సౌకర్యాలు కూడా కల్పిస్తామని హామీ ఇచ్చారు. 17 ఏళ్ళు ఎమ్మెల్యే, మంత్రిగా ఉన్న ఈటల ఒక్క మహిళా సంఘం భవనం కూడా కట్టలేదని ఫైర్ అయ్యారు. న్యాయం, ధర్మం వైపు నిలబడండి.. కష్టపడే వాళ్లను ఆశీర్వదించాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version