దేశమంతా ఏక్ నాథ్ షిండేలను సృష్టిస్తారట.. ఇదేనా సమాఖ్య స్ఫూర్తి : కేసీఆర్

-

దేశమంతా ఏక్ నాథ్ షిండేలను సృష్టిస్తామని బెదిరిస్తున్నారని.. ఇదేనా సమాఖ్య స్ఫూర్తి అన్ని కేంద్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించారు. ప్రభుత్వాలను కూల్చడమే సమాఖ్య విధానమా.. అని నిలదీశారు. దేశంలో ఏకస్వామ్య పార్టీ విధానం వస్తుందని భాజపా జాతీయ అధ్యక్షుడు అన్నారని.. ఈ నిరంకుశ విధానం దేశానికి మంచిదా అని అడిగారు. ప్రశ్నించిన రైతులను కార్లతో తొక్కించారని.. రాజ్యాంగ సంస్థలను జేబు సంస్థలుగా వాడుకుంటున్నారని కేసీఆర్ ఆరోపించారు.

ఏ దేశంలోనైనా ‘జాతి పిత’ అని పేరు పెట్టుకున్న వ్యక్తిని.. అహింసామార్గంలో స్వాతంత్ర్యం తెచ్చిన వ్యక్తిని అవమానిస్తారా? అని అడిగారు. ప్రధాన మంత్రేమో నీతి ఆయోగ్ లోగోలో గాంధీ కళ్లద్దాలు పెడితే.. బీజేపీ సంఘాలేమో గాంధీని దూషిస్తుంటారు.. గాంధీకి లేని అవలక్షణాలు ఉన్నట్లు చెప్తున్నారు. ఇలా ఎక్కడైనా ఉంటుందా? అని కేసీఆర్ ప్రశ్నించారు. ఉచిత పథకాలు రద్దు చేయాలని కొత్తగా తెరలేపారని.. వృద్ధులకు పింఛన్లు ఇవ్వడం ఉచితమా అని ప్రశ్నించారు. రైతులకు, రైతుబంధు, రైతు బీమా ఇవ్వడం ఉచితమా అని అడిగారు.

Read more RELATED
Recommended to you

Latest news