నిరుద్యోగులకు కేసీఆర్ గుడ్ న్యూస్…త్వరలో 70 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్..!

బీజేపీ ఏ వర్గ ప్రజలకు మెలు చేసింది అంటూ కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్ష ఉద్యోగాలు ఇచ్చామని ఇంకో 70వేల ఉద్యోగాలు ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. త్వరలో నోటిఫికేషన్ వెలువరిస్తామని….ఉద్యోగుల కోసమే అనేక సంస్కరణలు చేసామని కేసీఆర్ అన్నారు. నిరుద్యోగ సమస్య దేశంలో ఎంత ఉంది…తెలంగాణ లో ఎంత ఉంది అంటూ కేసీఆర్ ప్రశ్నించారు.

kcr
kcr

తెలంగాణ కు కేసీఆర్ ఏం చేసిండు అనేది మీ కేంద్ర మంత్రులను అడుగు అంటూ బండి సంజయ్ పై కేసీఆర్ ఫైర్ అయ్యారు. గజేంద్ర సింగ్ షేకవత్ టీఆరెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మెచ్చుకున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సాదించిన పురోగతి బీజేపీ పాలిత రాష్ట్రంలో ఎక్కడైనా సాదించిందా…? సూటిగా సమాధానం చెప్పు..? అంటూ బండి సంజయ్ ని కేసీఆర్ ప్రశ్నించారు.

ఎంట్ర‌న్స్ ప‌రీక్ష‌ల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్ర‌భుత్వోద్యోగం మీ ల‌క్ష్య‌మా.. అయితే Manalokam’s Vijayapatham.com వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి. మ‌రెన్నో ఇంట్రెస్టింగ్, వింత‌లు విశేషాలు, ప్రేర‌ణాత్మ‌క‌ క‌థ‌నాల కోసం మ‌న‌లోకం.కామ్ ని ఫాలో అవ్వండి.