ఆహా… నేను ప్రచారానికి వస్తా అంటున్న సారు

-

2018 ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత వచ్చిన ఏ ఒక్క ఉప ఎన్నికల్లో కూడా సీఎం కేసీఆర్ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి ప్రచారం చేయలేదు. టీఆర్ఎస్ పార్టీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నా సరే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా సీఎం కేసీఆర్ ప్రచారం చేయకపోవడంతో టీఆర్ఎస్ పార్టీ నేతలు చాలా ఇబ్బందులు పడ్డారు. మంత్రుల మీద పూర్తిగా భారం వదిలేయడం ఎమ్మెల్యేలు ప్రచారం చేయాలని పై నుంచి ఆదేశాలు రావడం వంటివి జరిగాయి.

సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్

ఈ తరుణంలో టీఆర్ఎస్ పార్టీ ని టార్గెట్ గా చేసుకుని కొన్ని కొన్ని రాజకీయపక్షాలు కాస్త సీరియస్ గానే రాజకీయం చేశాయి. భారతీయ జనతాపార్టీ సీఎం కేసీఆర్ ప్రచారానికి రాకపోవడం పై తీవ్రస్థాయిలో ఆరోపణలు కూడా చేయడం మనం చూసాం. అయితే ఇప్పుడు వస్తున్న కొన్ని వార్తలు ఏంటి అంటే తెలంగాణలో నాగార్జునసాగర్ ఉప ఎన్నికలు కాస్త సీరియస్ గా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతే ఆ పార్టీ ప్రభుత్వం పై ప్రజల అభిప్రాయం మారే అవకాశం ఉంటుంది.

సీఎం కేసీఆర్ కూడా కాస్త బలహీన పడినట్లే అవుతుంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా ఓడిపోయారు కాబట్టి ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. కాబట్టి ఇప్పుడు సీఎం కేసీఆర్ కచ్చితంగా నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో ప్రచారం చేసే అవకాశం ఉండవచ్చు అనే భావన ఉంది. పార్టీ అగ్రనేతలతో ఇప్పటికే సీఎం కేసీఆర్ చర్చలు జరిపారు. ఇక్కడ తాను ప్రచారానికి వస్తా అని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news