ఇండియాలో మహిళలకు గౌరవం లేదు : కేసీఆర్

టీఆర్ఎస్ ప్లీనరీ మీటింగ్ లో సీఎం, టిఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహిళలు ఎక్కడైతే రక్షించ- పూజించబడుతారో అక్కడ ఆ దేశం బాగుంది అంటూ కేసీఆర్ వ్యాఖ్యానించారు. మహిళలు సంతోషంగా ఉంటే అక్కడ దేవతలు సంచరిస్తారని కేసీఆర్ అన్నారు. వాస్తవానికి ఇండియాలో మహిళకు సరైన గౌవరం లేదు అంటూ కేసీఆర్ కామెంట్స్ చేసారు.

KCR-TRS
KCR-TRS

ప్రతిభ ఉన్న వాళ్లలో మహిళలు కూడా ఉన్నారని అన్నారు. టాలెంట్ ఉన్న మహిళలకు తగిన ప్రాధాన్యం ఇచ్చిన్నపుడే దేశం బాగుపడుతుందని..అప్పటి వరకు దేశం బాగుపడదు అంటూ ముఖ్యమంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహిళల టాలెంట్ కు పదును పెట్టాలని…మహిళలకు మంచి పదవులు ఇవ్వాలని కేసీఆర్ అన్నారు. అక్కడి నుంచి రత్నాలు వస్తారు అంటూ వ్యాఖ్యానించారు.