అనాథ పిల్లల సంరక్షణ పై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన

అనాథ పిల్లల సంరక్షణ పై టిఆర్ఎస్ పార్టీ అధినేత మరియు తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. అనాథలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే తల్లి తండ్రి అని సిఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఎక్కడ అనాదాలు ఉన్నా అందర్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని.. అనాథ పిల్లలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రకటన చేశారు కేసీఆర్.

kcr
kcr

మహిళలు ఎక్కడ పూజించబడతారో.. అక్కడ రాజ్యం బాగుంటుందని పేర్కొన్నారు. మహిళ ల్లో ప్రతిభావంతులు ఉంటారని పేర్కొన్న సిఎం కెసిఆర్.. మహిళలు అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపు నిచ్చారు. మహిళలు ముందు వరుస లో నిలబడాలని.. సెల్ఫ్ డబ్బా కొట్టు కోలేదు… చేసిందే ఇక్కడ చెబుతున్నారని స్పష్టం చేశారు సిఎం కేసీఆర్. మహిళల టాలెంట్ కు పదును పెట్టాలని.. మహిళలకు మంచి పదవులు ఇవ్వాలి- అక్కడి నుంచి రత్నాలు వస్తారన్నారు సిఎం కేసీఆర్. ప్రత్యేక రాష్ట్రం వస్తే… తెలంగాణ అంధకారంలోకి వెళుతుందని కొందరు ఆంధ్ర ప్రదేశ్‌ నాయకులు అన్నారని గుర్తు చేశారు. అలాంటి ప్రస్తుతం ఏపీనే అంధకారంలోకి వెళ్లిందని ఎద్దేవా చేశారు సీఎం కేసీఆర్‌.