కోదాడలో విజయ బావుటగా ఎగుర వేయాలి : కేసీఆర్

-

కోదాడ నియోజకవర్గంలో బీసీ చైతన్యం ఒక్కటై.. బీఆర్‌ఎస్ అభ్యర్థి మల్లయ్య యాదవ్‌ను గెలిపించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పిలుపునిచ్చారు. కోదాడ ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘కోదాడలో ఒక బీసీకి అవకాశం రాలేదు. పీహెచ్‌డీ వరకు చదివిన విద్యావంతుడని పిలిచి టికెట్‌ ఇచ్చాను. మీరు దీవిస్తే ఎమ్మెల్యేగా గెలిచాడు. మీ మధ్యనే ఉన్నడు తోచిన పనులు చేస్తున్నడు.

ప్రభుత్వం అందించే కార్యక్రమాలు, ఆయనగా చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. 60శాతం, 70శాతం బీసీ సామాజిక, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గం ఎందుకు ఓడిపావాలి. ఆ చైతన్యాన్ని చూపెట్టే బాధ్యత కోదాడ మీద ఉన్నది. కోదాడలో విజయ బావుటగా ఎగుర వేయాలి. మల్లయ్య యాదవ్‌ ఇప్పుడే నన్ను కోరారు. అగ్రకులాలతో పాటు పెద్ద సంఖ్యలో బీసీ కులాల ప్రజలు ఉన్నరు. ప్రత్యేకంగా కోదాడ కోసం బీసీ భవన్‌ను మంజూరు చేయాలని కోరారు. మల్లయ్య యాదవ్‌ను బంపర్‌ మెజారిటీతో గెలిపిస్తే రూ.10కోట్లతో కోదాడలో బీసీ భవన్‌ను కట్టించే బాధ్యత నాది. బీసీ చైతన్యాన్ని చూపించాలి.. చూపిస్తారనే నమ్మకం నమ్మకం ఉంది’ అన్నారు.

గతంలో ధాన్యం కొనుగోలు డబ్బులు చెల్లించడానికి ప్రభుత్వం రైతులను ఇబ్బంది చేసేది అన్నారు. కానీ తెలంగాణ సర్కార్ ఏర్పడ్డ తర్వాత ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే డబ్బులు ఖాతాల్లో జమ చేసిందన్నారు. గత పాలకులు అందించిన పెన్షన్ ఇప్పుడు తీసుకుంటున్న పెన్షన్‌లో ఎంత తేడా ఉందో గ్రహించాలని సూచించారు. భవిష్యత్తులో మరింత ఎక్కువ పెంచేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. యాదవులకు గొర్రెలు పంపిణీ చేయాలని ఎవరూ ఆలోచన చేయలేదని, వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపడానికి గొర్రెల పంపిణీ చేస్తున్నామన్నారు. ఇప్పటికే మొదటి దశ పూర్తయి రెండో దశ కొనసాగుతుందన్నారు. దళితుల జీవితంలో వెలుగులు చూసేందుకు వారికోసం దళిత బంధు పథకం తీసుకొచ్చామని తెలిపారు. ఎన్నికల తరువాత కోదాడ నియోజకవర్గంలో బ్రహ్మాండమైన బీసీ భవన్‌ను నిర్మిస్తామని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version