పురంధరేశ్వరికి విజయసాయి క్షమాపణ చెప్పాలి : భాను ప్రకాశ్ రెడ్డి

-

మద్యం అక్రమాలు జరుగుతున్నాయని అంటున్నాం.. కాదని నిరూపించే దమ్ము విజయసాయిరెడ్డికి ఉందా? వెంటనే విజయసాయి లెంపలు వేసుకుని.. పురందేశ్వరికి క్షమాపణ చెప్పాలని బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆదివారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బుద్ది ఉన్నవారు ఎవరూ ఇలా మాట్లారని అన్నారు. వైసీపీలో అందరూ కొడాలి నానిలా కావాలనుకుంటున్నారని.. నాని ఎప్పుడు ఎలా మాట్లాడతారో తెలీదని.. విజయసాయి కూడా అదే మార్గంలో వెళుతున్నారని విమర్శించారు.

ప్రతిపక్ష పార్టీలను తిట్టడం, సీఎంను మెప్పించడమే వైసీపీ నాయకులకు తెలిసిందని ఎద్దేవా చేశారు. అరాచక ప్రదేశ్, అవినీతి ప్రదేశ్‌గా మార్చారని, ధైర్యం ఉంటే.. మేము చెప్పిన అంశాలు అవాస్తవాలని నిరూపించాలని భానుప్రకాష్ రెడ్డి అన్నారు. డిజిటల్ యుగం నడుస్తుంటే.. మద్యం అమ్మకాల్లో కరెన్సీ మాత్రమే ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. ల్యాండ్, శాండ్, మైన్స్ ద్వారా కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని, ఆ అవినీతి డబ్బుతో ఎన్నికల్లో గెలవాలని భావిస్తున్నారని అన్నారు. ఓటుకు లక్ష రూపాయలు ఇచ్చినా కూడా జగన్‌కు ప్రజలు ఓట్లు వెయ్యరన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version