సచివాలయం పాత భవనాల కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో సెక్రటేరియట్ నూతన భవన సముదాయం నిర్మాణంపై మంగళవారం సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా నూతన సచివాలయం డిజైన్లపై క్యాబినెట్ లో చర్చించనున్నారు. రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన సెక్రటేరియట్ తెలంగాణ ప్రతిష్ట, వైభవానికి ప్రతీకగా ఉండాలని కేసీఆర్ భావించారు. దీనికి సంబంధించిన డిజైన్లను కూడా పరిశీలించారు. సెక్రటేరియట్ బాహ్యరూపం ఎలా ఉండాలి? లోపల సౌకర్యాలు ఎలా ఉండాలి? అనే విషయాలపై చర్చిస్తారు.
అనంతరం క్యాబినెట్ ఆమోదించిన డిజైన్లపై అధికారిక ప్రకటన చేయనున్నారు. ఈ సమీక్షలో మంత్రి ప్రశాంత్ రెడ్డి, సీఎస్, ఆర్కిటెక్టులు ఆస్కార్, పొన్ని తదితరులు పాల్గొంటారు. అలాగే సాగునీటి, ఆర్ అండ్ బీ శాఖలపై సుదీర్ఘంగా సమీక్షించనున్నారు. గోదావరి, కృష్ణా నదుల సాగునీటికి సంబంధించి అంశాలపై ఈ భేటీలో చర్చిస్తారు.