తెలుగు రాష్ట్రాలపై కరోనా పంజా.. వణికిపోతున్న ప్రజలు..! కేసుల సంఖ్య చూస్తే వామ్మో అనాల్సిందే..!

-

తెలుగు రాష్ట్రాలలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది.. దీని దెబ్బకి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. లాక్ డౌన్ సడలింపుల తర్వాతే దీని ప్రభావం మరీ తీవ్రంగా మారింది. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా.. దీన్ని కట్టడి చేయలేకపోతున్నారు. తాజాగా.. ఆంధ్రప్రదేశ్ లో ఆదివారం ఒక్క‌రోజే రికార్డు స్థాయిలో 5,041 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. కరోనాతో 56 మంది చ‌నిపోయారు. 1,106 మంది డిశ్చార్జ్ అయ్యారు. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 49,650కు చేరింది. మొత్తం 642 మంది మ‌ర‌ణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 22,890 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 26,118 యాక్టివ్ కరోనా కేసులున్నాయి.

అలాగే తెలంగాణలో ఆదివారం నాడు కొత్తగా 1,296 కరోనా కేసులు నమోదవ్వగా, ఆరుగురు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 45,076కి చేరింది. కరోనాతో ఇప్పటివరకు మొత్తం 415 మంది చనిపోయారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 32,438 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం తెలంగాణలో 12,224 యాక్టివ్ కరోనా కేసులున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version