తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఏపీలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే ఆయన కంకిపాడులో తెలుగు దేశం పార్టీ కీలక నేత దేవినేని ఉమ కుమారుడి వివాహానికి హాజరయ్యారు.ఆయన వెంట ఏపీ మంత్రి నారాలోకేశ్ సైతం ఉన్నారు.
కృష్ణా జిల్లాలోని కంకిపాడులో జరుగుతున్న దేవినేని ఉమ తనయుడి వివాహా కళ్యాణ మండపానికి వెళ్లగా.. అక్కడ ఏపీ మంత్రులు ఆయన్ను ఘనంగా రిసీవ్ చేసుకున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అక్కడకు చేరుకోగానే పెద్దఎత్తున అభిమానులు, టీడీపీ కార్యకర్తలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలాఉండగా, విజయవాడ కనకదుర్గమ్మను దర్శించడానికి సీఎం రేవంత్ బుధవారం ఏపీకి వెళ్లిన విషయం తెలిసిందే.