ఇందిరమ్మ ఇళ్లపై సీఎం రేవంత్ రెడ్డి హైలెవల్ మీటింగ్

-

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్లను నిరుపేదలకు అందజేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. మేనిఫెస్టోలోనూ ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ పొందు పరిచింది. ఈ క్రమంలోనే ఆదివారం ఇందిరమ్మ ఇండ్లపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.

ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద మొదటి దశలో అత్యంత నిరుపేదలకు, అర్హులకు మాత్రమే గృహాలను కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ పథకం పారదర్శకంగా, నిరుపేదలకు న్యాయం చేసేలా అమలు కావాలని అధికారులకు ఆదేశాలు సైతం జారీచేశారు. పథకంలో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా చూడాలని సూచనలు చేసినట్లు అధికార వర్గాల సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news