తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన షెడ్యూల్ విడుదల అయింది. ఇవాళ మొత్తం ఢిల్లీలోనే పర్యటించనున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఇక షెడ్యూల్ ప్రకారం…ఇవాళ ఉ.11 గంటలకు న్యూజెర్సీ గవర్నర్ ఫిలిప్ డి. మర్ఫీతో భేటీ కానున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.

ఉ. 11:30కు బిజినెస్ స్టాండర్డ్ ఎడిటర్ మోడరేట్ చేసే 12వ వార్షిక ఫోరమ్‌లో ప్రసంగం ఉండనుంది. మ. 12 గంటలకు అమెజాన్, కార్ల్స్ బర్గ్, కార్లైల్, గోద్రెజ్, ఉబెర్ కంపెనీల ప్రతినిధులతో పెట్టుబడులపై విడివిడిగా సమావేశాలు జరుగనున్నాయి. మ. 12:30కు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ అధ్యక్షుడు, సీఈఓ, నార్వే మాజీ యూనియన్ మంత్రి బోర్జ్ బ్రెండేతో ప్రత్యేక భేటీ జరుగనుంది. ఈ మేరకు షెడ్యూల్ ఫిక్స్ అయింది.