ఎస్సీ వర్గీకరణ అమలు తీర్మాణాన్ని సభలో ప్రవేశపెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. తాజాగా సీఎం అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ పై మాట్లాడారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్ గా మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎంపీ మల్లు రవిలు కమిటీ సభ్యులుగా నియమించామని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.
ఎస్సీ వర్గీకరణ మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. సుప్రీం కోర్టు తీర్పును అమలు చేస్తున్నామని తెలిపారు. 82 రోజుల్లొనే కమిషన్ నివేదిక అందించింది. మూడు గ్రూపులుగా ఎస్సీ వర్గీకరణ చేపట్టాం. ఏ, బీ, సీ గా విభజన చేశాం. ఏ గ్రూపు ఎస్సీల్లో అత్యంత వెనుకబడిన కులాలు సంచార కులాలు 1 శాతం, బీ గ్రూపు – మాదిగ, మాదిగ ఉపకులాలు 9 శాతం రిజర్వేషన్, సీ గ్రూపులో మాల, మాల ఉపకులాలు 5 శాతం వచ్చింది. ఎస్సీ వర్గీకరణ కోసం ఎన్నో ఉద్యమాలు జరిగాయి. నా కోసం ఒక పేజీ ఏదైనా రాసుకోవాల్సి వస్తే.. ఫిబ్రవరి 25ను రాసుకుంటానని తమ దృష్టికి తీసుకొస్తున్నానని తెలిపారు. కమిషన్ క్రిమిలేయర్ ప్రవేశపెట్టాలని ప్రతిపాదించింది.. కానీ మంత్రి వర్గం దానిని తిరస్కరించిందని వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి.