రైతుబంధు డబ్బు జమ చేయడం లేదన్న ప్రతిపక్షాల విమర్శలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ‘జనవరిలో మొదలుపెట్టి మార్చి 31లోగా చెల్లిస్తాం అని తెలిపారు. ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా అందరికీ జమ చేస్తాం. 15 రోజుల్లోనే రైతుబంధు ఇచ్చేయవచ్చు. కాకపోతే ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, సంక్షేమ హాస్టల్ డబ్బులు ఆపాలి.
కెసిఆర్ డిసెంబర్లో మొదలు పెట్టి అక్టోబర్ వరకు చెల్లించారు అని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచారు’ అని కేసిఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.ఇకపై అనర్హులకు రైతు భరోసా ఇవ్వబోమని.. వ్యవసాయం చేసే రైతులకు మాత్రమే పెట్టుబడి సహాయం అందిస్తామని స్పష్టం చేశారు.సాగు చేయని, సాగు చేయడానికి పనికిరాని కొండలు, గుట్టలు.. ఆఖరికి రోడ్లు ఉన్న స్థలానికి కూడా రైతుబంధు సాయం ఇచ్చారని ఆయన విమర్శించారు.