ఢిల్లీ పాకిస్థాన్ లో ఉందా..? ఎన్ని సార్లైనా ఢిల్లీకి పోతా – సీఎం రేవంత్

-

Telangana Chief Minister Revanth Reddy on delhi tours: ఢిల్లీకి పోతే కూడా రాజకీయం చేస్తున్నారు..అదేమైనా పాకిస్థాన్ లో ఉందా..? అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజాపాలన దినోత్సవం జరిగింది. పబ్లిక్ గార్డెన్ లో జాతీయ జెండా ఎగురవేసిన సీఎం రేవంత్ రెడ్డి..అనంతరం మాట్లాడారు. 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

Telangana Chief Minister Revanth Reddy on delhi tours

తెలంగాణ రాష్ట్ర హక్కుల కోసం.. ఎన్ని సార్లైనా ఢిల్లీకి పోతామని పేర్కొన్నారు. లేక్ సిటీ కాస్త.. డ్రగ్స్ సిటిగా మార్చేశారని గులాబీ సర్కార్ పై ఆగ్రహించారు. చెరువుల రక్షణకు హైడ్రాను తీసుకొచ్చామన్నారు. ప్రకృతి విపత్తు రాకుండా చూడాలని కోరారు. హైడ్రా వెనకాల రాజకీయం లేదన్నారు. కొందరు హైడ్రానీ నీరుకార్చే పనిలో ఉన్నారు.. ఎవరు అడ్డుకున్నా ఆగదు హైడ్రా.. ప్రజలు సహకరించాలని చెప్పారు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version