తెలంగాణకు విమోచనం..కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

-

వేలాది మంది ప్రజల విరోచిత పోరాటం ఫలితంగా నిజాం పాలన నుంచి తెలంగాణకు విమోచనం లభించిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవ వేడుకలను బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించగా.. దీనికి ముఖ్య అతిథిగా కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగురవేసిన ఆయన తెలంగాణ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అనేక బలిదానాలు, అనేక త్యాగాల అనంతరం తెలంగాణకు స్వాతంత్య్రం దక్కిందని, నిజాం రాజకార్ల మెడలు వంచి తెలంగాణ సాధించడంలో సర్దార్ వల్ల‌భాయ్ పటేల్ పాత్ర సాహసోపేతమైనదని వ్యాఖ్యానించారు.

 

ఆ గొప్ప విజయానికి ప్రతీకగానే మూడేళ్ళ నుంచి కేంద్రం అధికారికంగా తెలంగాణ విమోచన వేడుకలు నిర్వహిస్తోందన్నారు.కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రజాకార్ల వారసత్వమైన మజ్లిస్ పార్టీకి కొమ్ముకాస్తూ తెలంగాణ ప్రజలను మోసం చేశాయి. విమోచన దినోత్సవాన్ని నిర్వహించకుండా రెండు పార్టీలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version