ప్రధాని మోడీ నాకు బిగ్ బ్రదర్ అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించాలని నిర్ణయించిన సీఎం రేవంత్ రెడ్డి… ఈ మేరకు అసెంబ్లీ లో ప్రకటించారు. పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టుపై మీరు సజెషన్స్ ఇవ్వండి.. డెసిషన్స్ అవసరం లేదని వెల్లడించారు. నేను హౌస్ లీడర్‌ని.. నేను డెసిషన్స్ తీసుకుంటానని ప్రకటించారు.

మోడీ మన బిగ్ బ్రదర్…. ఈ దేశంలో ప్రధానమంత్రి ప్రతి ముఖ్యమంత్రికి బడా బాయ్ అవుతాడని మరోసారి మోడీని మెచ్చుకున్నారు. ముఖ్యమంత్రుల సమూహానికి ప్రధాన మంత్రి ఆయన అని చెప్పారు రేవంత్ రెడ్డి. నేను ఢిల్లీకి వెళ్తుంది లెక్కిస్తున్నారు… కేటీఆర్ 50 సార్లు నేను ఢిల్లీకి వెళ్లా అని అంటున్నాడు… నేను ఢిల్లీకి వెళ్ళేది సర్కస్ చూడటానికి కాదు.. మోదీని, నిర్మలా సీతారామన్‌ని కలవడానికి వెళ్తున్నాను అని చెప్పారు రేవంత్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.85,449 కోట్లు అప్పు తీసుకున్నారు… రూ.27,738 కోట్లు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 11.5 శాతం వడ్డీకి తీసుకున్నారని ఆరోపణలు చేసారు రేవంత్ రెడ్డి.