సిబిఐ చేతికి కాళేశ్వరం కేసు… రాహుల్ పరువు తీసిన కేటీఆర్

-

సిబిఐ చేతికి కాళేశ్వరం కేసు వెళ్లడంపై కేటీఆర్ స్పందించారు. రాహుల్ గాంధీ ఏమో బీజేపీ జేబు సంస్థ సీబీఐ అని అంటాడు… తెలంగాణలో రేవంత్ రెడ్డి కాళేశ్వరం కేసును అదే సీబీఐకి అప్పగిస్తున్నాడని చురకలు అంటించారు. మిస్టర్ రాహుల్ గాంధీ, మీ తెలంగాణ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడో మీకు కనిపిస్తుందా? అని ప్రశ్నించారు కేటీఆర్.

KTR gets serious about Rahul Gandhi
ktr seerious comments on congre and rahul gandhi

మీరు ఎన్ని కుట్రలు పన్నినా, మేము చట్టపరంగా, రాజకీయంగా పోరాడుతామని స్పష్టం చేసారు. న్యాయవ్యవస్థ మరియు ప్రజలపై మాకు నమ్మకం ఉంది… సత్యమేవ జయతే అని కేటీఆర్ ట్వీట్ చేసారు.కాగా రాహుల్ గాంధీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా బీజేపీ కోసం పనిచేస్తూ కాళేశ్వరం విచారణను సీబీఐకి అప్పగించినట్లు రేవంత్ రెడ్డి ట్రోలింగ్ చేశారు కేటిఆర్.

గతంలో ఎన్నోసార్లు సీబీఐకి వ్యతిరేకంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి, 1 రోజు ముందు సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభలో సైతం బీజేపీ సీబీఐ, ఈడీ సంస్థలను వాడుకుంటుంది అని వ్యాఖ్యలు చేసి తెల్లారేసరికి కాళేశ్వరం విచారణను సీబీఐకి అప్పగించడం పై ఒరిజినల్ కాంగ్రెస్ వాదులు విస్మయం చెందుతున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news