తెలంగాణ రాష్ట్రంలో ఎదురవుతున్న కరవు పరిస్థితులను సమిష్టిగా ఎదుర్కోవలసిన అవసరం ఉందని అన్నారు సీఎం రేవంత్. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 26 రకాల పంటలు పండటానికి అనుకూలమైన భూములు, వాతావరణం ఉందని, కేవలం వరి లేదా పత్తి, మిర్చీ పంటలకే పరిమితం కాకుండా ఇతర పంటలు సాగు చేయాలని, పంట మార్పిడి ద్వారా అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ చెప్పారు.
ఈ కార్యక్రమాన్ని భవిష్యత్తులో అన్ని గ్రామాలకు విస్తరిస్తామని, రైతులందరూ ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలన్నారు. ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క, మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు చేసిన సూచనలతో ప్రభుత్వం ఇటీవలే పంటల బీమా పథకాన్ని అమల్లోకి తెచ్చిందని గుర్తు చేశారు. రైతులు ఏదైనా ఆపదతో చనిపోతే ఆ కుటుంబాన్ని రైతు బీమా పథకం ఆదుకుంటుందని అన్నారు. రైతులు ధీమాగా బతికేందుకు రైతు బీమా పథకంతో పాటు పంటల బీమా పని చేస్తుందన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా రైతులు ధైర్యం కోల్పోవద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం అన్నారు.