రుద్రాక్ష మొక్కను నాటిన సీఎం రేవంత్ రెడ్డి

-

వన మహోత్సవం సందర్బంగా రుద్రాక్ష మొక్కను నాటారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వన మహోత్సవం కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. యూనివర్సిటీ ప్రాంగణంలో రుద్రాక్ష మొక్కను నాటి వన మహోత్సవాన్ని ప్రారంభించారు. అటవీ శాఖ, HMDA ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకించారు.

CM Revanth Reddy , Rudraksha plant
CM Revanth Reddy , Rudraksha plant

ఆయన వెంట మంత్రి కొండా సురేఖ, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ మల్లు రవితో పాటు మరి కొంతమంది అధికారులు ఉన్నారు. ఇదిలా ఉండగా…. రాష్ట్రంలో ప్రతి ఒక్క మహిళ మొక్కలను పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ పెద్దలు “మనమే వనం…. మనమే మనం” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సంవత్సరం 18 కోట్ల మొక్కలు నాటాలని ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామంటూ ప్రతి ఒక్కరికి సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news