సీఎం రేవంత్ రెడ్డి షాక్..‘హైడ్రా’పై దానం నాగేందర్ సీరియస్

-

సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ షాక్ తగిలినట్లు అయ్యింది. తమ పార్టీనేత ఏకంగా సీఎం నిర్ణయాన్ని తప్పుబట్టడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల టైంలో బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన హైడ్రా పనితీరును తప్పుబట్టారు. హైడ్రా కూల్చివేతలపై దానం సంచలన వ్యాఖ్యలు చేశారు.

మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లను కూల్చడం సరికాదని అన్నారు.‘మురికివాడల జోలికి వెళ్లొద్దని ముందే చెప్పాను.జలవిహార్,ఐమాక్స్‌లాంటివి చాలా ఉన్నాయి. పేదల ఇళ్లను కూల్చడం సరికాదు. మూసీ నిర్వాసితులకు కౌన్సిలింగ్ ఇవ్వాల్సింది.ప్రత్యామ్నాయ ఏర్పాట్ల తర్వాత ఖాళీ చేయించాల్సింది.ఎప్పుడో డిసైడ్ చేసిన బఫర్ ఎఫ్‌టీఎల్ పరిధిలో ఇప్పుడు ఎలాంటి ఇబ్బందీ లేదు.ఇళ్లకు రెడ్‌మార్క్ చేయడం కచ్చితంగా తొందరపాటు చర్యే.కూల్చిన ఇళ్లకు అక్కడే నివాసాలు కల్పిస్తే మంచిది.ఈ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళతాను’ అని దానం చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news