హైడ్రా విషయంలో దూకుడు పెంచిన ఈటెల.. మైలేజ్ పెంచుకునే పనిలో బిజేపీ..

-

తెలంగాణా రాజకీయాలన్నీ ఇప్పుడు హైడ్రాచుట్టూనే తిరుగుతున్నాయి.. అక్రమ కట్టడాలను కూల్చెయ్యాలంటూ సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాకు పుల్ పవర్స్ ఇచ్చారు.. ఈ క్రమంలో అధికారులు భారీభవనాలను సైతం కూల్చేస్తున్నారు.. సినీ హీరోల ఆస్తుల దగ్గర నుంచి.. అధికారపార్టీనేతల దాకా అందరిలెక్కలూ తేలుస్తున్నారు.. ఈ క్రమంలో రోడ్డున పడ్డ వారికి బిజేపీ అండగా నిలుస్తోంది.. ఈటెల రాజేందర్ ఆధ్వర్యంలో పోరాటాలకు సిద్దమవుతోంది..

హైడ్రాను కేంద్రబిందువుగా మార్చుకుని.. తెలంగాణాలోని మూడు ప్రధాన పార్టీలిప్పుడు మైలేజీ కోసం పావులు కదుపుతున్నాయి.. అధికారంలో ఉన్న కాంగ్రెస్‌తోపాటు ప్రతిపక్షాలు బీఆర్ఎస్, బీజేపీ కూడా హైడ్రా కేంద్రంగానే పొలిటికల్ యాక్టివిటీస్ ను పెంచుతున్నాయి. అన్ని పనులు పక్కన పెట్టి మరీ.. హైడ్రా వ్యవహారాన్ని హైలెట్ చేస్తున్నాయి.. హైడ్రాను టార్గెట్ గా చేసుకుని.. కాంగ్రెస్ ను ఇబ్బంది పెట్టాలని బిజేపీ, బిఆర్ఎస్ చూస్తున్నాయి.. కూల్చివేతలతో నష్టపోయిన వారికి బీజేపీ తరఫున ఎంపీ ఈటల రాజేందర్, బీఆర్ఎస్ తరఫున మాజీమంత్రి హరీశ్‌ దూకుడు పెంచుతూ హైడ్రాను టార్గెట్ చేస్తున్నారు.

హైడ్రా వ్యవహారంపై కాంగ్రెస్ లో కూడా అసంతృప్తివ్యక్తమవుతోంది.. కాంగ్రెస్ పార్టీకే చెందిన కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు కుటుంబానికి చెందిన భవనాలు సైతం హైడ్రా నేలమట్టం చేసింది.. ఇదే ఊపులో మాజీ మంత్రి కేటీఆర్ లీజుకు తీసుకున్న జన్వాడ ఫాంహౌస్ కు కూడా నోటీసులు ఇచ్చేసింది హైడ్రా. దీంతో ఇది తెలంగాణలో హాట్ టాపిక్ గా మారాయి.. హైడ్రాకు వ్యతిరేకంగా జనాలు తిరగబడుతూ ఉండటంతో వాటిని పొలిటికల్ మైలేజ్ గా మలుచుకునేందుకు ఈటెల రాజేందర్ సిద్దమయ్యారట..

గతకొద్దిరోజుల నుంచి ఈటెల రాజేందర్ రాజకీయ కార్యక్రమాలను పక్కనపెట్టి మరీ.. హైడ్రా బాధితుల కోసం పోరాటాలు చేస్తున్నారు..ఈ ఇష్యూలో బీజేపీకి మైలేజ్ పెరుగుతుందనే అంచనాతో ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం కూడా ఈటలను ప్రోత్సహిస్తూ.. మిగిలిన నేతలు కూడా బాధితుల తరఫున పోరాడాలని పిలుపునిస్తోంది. మరోవైపు ఎంఐఎం నేతల భవనాల జోలికి ఎందుకు వెళ్లడం లేదని ప్రభుత్వాన్ని నిలదీస్తోంది.. ఈ పోరాటాల వల్ల బిజేపీకి మైలేజ్ పెరుగుతుందో లేదో చూడాలి..

Read more RELATED
Recommended to you

Latest news