నేడు భద్రాద్రి జిల్లా బెండాలపాడులో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2.20 గంటలకు బెండాలపాడుకు చేరుకోనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల గృహప్రవేశ మహోత్సవంలో పాల్గొననున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పైలట్ ప్రాజెక్టుగా బెండాలపాడు గ్రామం ఎంపికయ్యారు.

ఇది చారిత్రక ఘట్టమన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి… ఒక్క బెండాలపాడు గ్రామానికే 310 ఇందిరమ్మ ఇళ్లు కేటాయించారు. వీటిలో ఇప్పటికే 58 ఇళ్ల స్లాబులు పూర్తి కాగా, 86 ఇళ్లు పైకప్పు దశలో, మరో 150 ఇళ్లు పునాది స్థాయిలో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలోనే అతి తక్కువ సమయంలో అత్యధిక ఇళ్లను పూర్తి చేసిన గ్రామంగా బెండాలపాడు నిలిచింది.