గులాబీ పార్టీకి సంబంధించిన కల్వకుంట్ల కవిత ఎపిసోడ్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. కల్వకుంట్ల కవితను నిన్న సస్పెండ్ చేసింది గులాబీ పార్టీ. కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదేశాల మేరకు… కవితలు పార్టీ నుంచి బయటకు పంపించారు. ఈ నిర్ణయం తీసుకున్న వెంటనే… కవిత ఫ్లెక్సీలు, దిష్టిబొమ్మ దహనం కూడా చేశారు గులాబీ పార్టీ నేతలు.

హరీష్ రావు లాంటి మంచి లీడర్ను ఉద్దేశించి కల్వకుంట్ల కవిత ఆరోపణలు చేశారని… అలాంటి కవితను పార్టీ నుంచి కేసీఆర్ బయటకు పంపించడం మంచి పరిణామం అని గులాబీ పార్టీ నేతలు కూడా అంటున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో ఇవాళ మీడియా ముందుకు కల్వకుంట్ల కవిత వచ్చే ఛాన్సులు ఉన్నాయి. ఈ సందర్భంగా తన ఎమ్మెల్సీ పదవికి ఆమె చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే కెసిఆర్ కుటుంబం పై కూడా ఆరోపణలు చేసే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల సమయంలో కల్వకుంట్ల కవిత ప్రెస్ మీట్ ఉండే ఛాన్స్ ఉంది.