యాంకర్‌కు కరోనా.. అయినా షో కొనసాగిస్తానని ప్రకటన

-

న్యూయార్క్‌ : ప్రముఖ అంతర్జాతీయ న్యూస్‌ చానల్‌ సీఎన్‌ఎన్‌లో యాంకర్‌గా పనిచేస్తున్న క్రిస్టోపర్‌ చార్లెస్‌ క్యూమో(క్రిస్‌ క్యుమో) తనకు కరోనా పాజిటివ్‌గా తేలిందని వెల్లడించారు. సీఎన్‌ఎన్‌లో రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే క్యుమో ప్రైమ్‌ టైమ్‌ షోకు ఆయన యాంకర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తనకు కరోనా సోకినప్పటికీ ఇంటి వద్ద నుంచి పనిచేస్తానని క్రిస్‌ వెల్లడించారు. తన క్యుమో ప్రైమ్‌ టైమ్‌ను కొనసాగిస్తానని స్పష్టం చేశారు.

ఇందుకు సంబంధించి క్రిస్‌ ట్విటర్‌లో కొన్ని పోస్ట్‌లు చేశారు. ‘ఈ కష్టకాలం నాకు మరింత కష్టంగా మారింది. ‘నాకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇటీవలి కాలంలో కరోనా పాజిటివ్‌గా తేలిన వారితో కార్యక్రమాలు చేశాను. ప్రస్తుతం నాకు జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తింది. దీనిని నేను పిల్లలకు, నా కుటుంబసభ్యులకు చేరనివ్వను. అలా జరిగితే ఆ బాధ నన్ను ఈ రోగం కన్నా ఎక్కువగా కుంగదీస్తుంది. అందుకే నేను నా బేస్‌మెంట్‌లోనే క్వారంటైన్‌లో ఉన్నాను(ఇలా చేయడం నా కుటుంబ సభ్యులకు హాని కలిగించదు). నేను ఇక్కడి నుంచే నా షో లను చేస్తాను. తెలివిగా, కలిసికట్టుగా.. మనం దీనిని ఎదుర్కొందాం’ అని క్రిస్‌ తెలిపారు.

కాగా, క్రిస్‌ చివరిగా సోమవారం తన సోదరుడు న్యూయార్క్‌ గవర్నర్‌ అండ్రూ క్యుమోను ఇంటర్వ్యూ చేశాడు. అయితే మంగళవారం తన బేస్‌మెంట్‌లోనే క్వారంటైన్‌ అవుతున్నట్టు క్రిస్టోపర్‌ ప్రకటించారు. క్రిస్‌కు కరోనా పాజిటివ్‌గ తేలడంపై అండ్రూ స్పందిస్తూ… ఈ వైరస్‌ చాలా ప్రమాదకరమైనదని అన్నారు. తన సోదరుడు, బెస్ట్‌ ఫ్రెండ్‌ క్రిస్‌కు త్వరలోనే కోలుకుంటాడని ధీమా వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news