లేదు ఏదీ వాడుకకి అనర్హం .. కరోనా ని అద్భుతంగా వాడుతున్నారు !

-

ప్రజెంట్ ట్రెండ్ అవుతున్న టాపిక్ ని వాడుకోవటంలో సోషల్ మీడియా ని అద్భుతంగా ప్లాట్ ఫాం చేసుకుని మన వాళ్ళు చాలా ముందు ఉంటారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలులోకి ఉండటంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇంటికే పరిమితమయ్యారు. దీంతో చాలామంది భార్యలకు భర్తలు వంటింట్లో సాయం చేస్తూ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. మరి కొంతమంది అయితే పిల్ల చేష్టలు చేస్తూ అల్లరి చేష్టలు చేస్తూ పిల్లలతో ఆడుకుంటూ ఆ వీడియోలను పోస్ట్ చేస్తున్నారు.Play Raise Rummy - India's most refreshing Rummy format only on ...ఇదిలా ఉంటే కరోనా వైరస్ ని అడ్డంపెట్టుకుని ఆన్ లైన్ లో కొన్ని కంపెనీలు ఇంటిలో ఉన్న జనాల్ని ఎట్రాక్ట్ చేయడానికి కరోనా ని అద్భుతంగా వాడుతున్నారు. చాలామంది కరోనా వైరస్ వల్ల మందుబాబులు బయటికి వెళ్ళ లేక పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తూ ఇంటి లోనే ఉంటున్నారు. వాళ్లకి మరో ఆప్షన్ లేక చాలామంది మెంటల్ గా ప్రవర్తిస్తున్నారు. కానీ పేకాట రాయుళ్ళ కి మాత్రం అటువంటి మెంటల్ టెన్షన్ ఏమి లేదు ప్రస్తుతం. విషయంలోకి వెళితే ఆన్ లైన్ లో కొన్ని కంపెనీలు రమ్మీ ఆట ని అందుబాటులోకి తీసుకు రావడంతో చాలామంది ఇంట్లోనే ఉంటూ పేకాట ఆడుతున్నారు.

 

ఇదే తరుణంలో ఆన్లైన్ లో పేకాట ని ప్రోత్సహించే వెబ్సైట్లు కూడా క్రియేటివ్ ప్రకటనలతో పేకాటరాయుళ్ల ను ఆకట్టుకుంటున్నాయి. బయటకెళ్ళి ఆడితే  ఆట ఆడే టప్పుడు ఎవడైనా తుమ్మినా, చేతులు మీద చేతులు మీద వేసినా, కరోనా భయం మీకు వెంటాడుతుంది కాబట్టి ఎందుకు వచ్చిన సొంత ఇంట్లోనే కూర్చుని ఆన్లైన్ లో సుబ్బరంగా పేకాట ఆడుకుంటే ఇంట్లోనే సక్కగా లక్షాధికారి, కోటీశ్వరుడు అయిపోతారు అంటూ ప్రకటనల మీద ప్రకటనలు చేస్తున్నాయి. మొత్తం మీద కరోనా వైరస్ ఎఫెక్ట్ తో వాడకంలో ఏదీ లేదు అని అనర్హం అన్నట్టుగా సోషల్ మీడియాలో ప్రకటనల పరిస్థితి ఉంది. 

Read more RELATED
Recommended to you

Latest news